మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది గనిగా వచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం యూకేలోనే జరగనుంది. లండన్ షెడ్యూల్లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లోనే చేస్తారట. వరుణ్ తేజ్ కెరీర్లో 12వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. జనవరి 19న వరుణ్ బర్త్ డే కానుకగా.. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
When keeping peace is the business, M4 Carbine becomes his Gandeevam.
ఈ సినిమాకు డిఫరెంట్‌గా ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అందుకు తగ్గేట్టే.. సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. బ్లాస్టింగ్, గన్స్‌తో మోషన్ టీజర్ మోతమోగిపోయింది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. వరుణ్ లుక్ అదరహో అనేలా ఉంది. ఇందులో వరుణ్ అండర్ కవర్ కాప్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇకపోతే.. నాగార్జున ‘ది ఘోస్ట్’ తర్వాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా ఇదే. దాంతో వరుణ్‌తో పాటు ప్రవీణ్ సత్తారుకు కూడా ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకం కానుంది. ఈ సినిమాతో పాటు ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా చేస్తోన్నాడు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరీ ‘గాండీవధారి అర్జున’గా వరుణ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.