GDWL: జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షించారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ స్కీమ్ (ESS) కింద లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు చొరవ చూపాలని ఆదేశించారు. పారదర్శక ఎంపిక ద్వారా అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు.