NDL: పాణ్యం మండల కొత్తూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులకు ఉగాది పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ, ఉత్సవాల కమిటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పుల్లయ్య, వీరయ్య, వేద పండితులు రోహిత్ శర్మకు ఉగాది పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉగాది పండుగ విశిష్ఠతను వారు వివరించారు.