NRPT: సోషల్ మీడియాలో మతాలను, వ్యక్తులను కించపరిచేలా, లేదా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ముఖ్య సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లో అనుచిత పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.