NGKL: బల్మూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డిని గురువారం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూనే, ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన నేతలకు ధన్యవాదములు తెలిపారు.