NTR: తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజబోయిన రామచంద్రరావుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “ఉత్తమ సేవ పథకం” పురస్కారం ప్రకటించింది. పోలీస్ విభాగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రరావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.