NRPT: మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో మంచినీటి పైప్లైన్ తరచూ లీక్ అవుతూ తాగునీరు వృథాగా పారిపోతోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలతో మురికి నీరు కలిసే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.