RR: HYD దుర్గం చెరువు ఫ్రంట్ గేట్ వద్ద గత వారం రోజులుగా చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని అక్కడికి వెళ్లిన వాకర్లు తెలిపారు. రసాయనాలు పిచికారీ చేసినా అసలు సమస్య పరిష్కారం కాలేదని, ప్రజలకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వెంటనే చెత్తను పూర్తిగా తొలగించి, శుభ్రత చర్యలు చేపట్టి సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు.