అక్టోబర్ 5వ తేదిన రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) నోటీసులిచ్చింది. ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టేను అక్టోబర్ 16వ తేది వరకూ పొడిగిస్తూ ఆదేశించింది. ఫిబ్రవరి 2వ తేదిన రాజస్థాన్ లోని బార్మర్‌లో మతపరమైన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా పాల్గొన్నారు. ఆ సమయంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని పథాయ్ ఖాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోటాన్ పోలీస్ స్టేషన్లో యోగా గురువుకు వ్యతిరేకంగా ఆయన ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది.
విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను కించపరిచారనే అభియోగాల కింద రామ్‌దేవ్ బాబాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్ట్ నుంచి తనకు ఊరట ఇవ్వాలని కోరుతూ రామ్‌దేవ్ బాబా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ధర్మాసనం ఆయన్ని అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. మే 20వ తేదిలోపు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు.
మరోవైపు రామ్‌దేవ్ బాబా పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు సోమవారం విచారణ చేసింది. అక్టోబర్ 5వ తేదిన ఆయన చోటాన్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, విచారణ అధికారి పిలిచినప్పుడు ఆయన వద్దకు వెళ్లాలని ఆదేశించింది. అక్టోబర్ 16వ తేదిన కేసు డైరీని కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. అప్పటి వరకూ బాబా అరెస్ట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశించింది.