HYD: రైల్వే వేగం, ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణాలలో రైల్వే అండర్ పాస్ నిర్మాణాలు 10 నుంచి 12 అడుగుల వెడల్పుతో నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తాను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.