NDL: గత ఏడాది జూలై 13న చిన్నారుట్ల గూడెంలో కుడుముల అంజలి అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి గాయపరిచింది. ఈ మేరకు అటవీ శాఖ నెక్కంటి రేంజర్ పీవీ.సాయి కుమార్ నష్టపరిహారం కింద రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో వెంకటయ్య, ఎఫ్బీవో మదన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.