సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 23 నెలలకు సంబంధించిన బకాయిలు అన్నింటినీ కలిపి ఒకేసారి జమ చేయనున్నట్లు వెల్లడించింది.
సింగరేణి కార్మికులకు (Singareni Employees), ఉద్యోగులకు కేసీఆర్ (KCR) సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న ఏరియర్స్ (Arrears) అన్ని కలిపి ఒకేసారి చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన ఉద్యోగులందరి అకౌంట్లలో ఆ ఏరియర్స్ నగదు వేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. దీంతో ఒక్కో కార్మికుడి అకౌంట్లోకి సుమారు రూ.4 లక్షలు మేర ఏరియర్స్ పడే అవకాశం ఉంది.
దాదాపు 40 వేల మంది ఉద్యోగుల అకౌంట్ల (Bank Accounts)లో ఈ నగదు జమ కానుంది. కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం ప్రకారం 23 నెలల పెండింగ్ బకాయిలను (Pending Arrears) రూ.1726 కోట్లను కేసీఆర్ సర్కార్ విడుదల చేయనుంది. సింగరేణి చరిత్రలో మొదటిసారిగా ఇంత మొత్తంలో వేతన బకాయిలను యాజమాన్యం చెల్లిస్తోంది. ఈ తరుణంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటోంది.
సీఎం కేసీఆర్ (CM KCR), టీజీబీకేఎస్ అధ్యక్షురాలు కవిత ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సింగరేణి కార్మికుల (Singareni Employees)కు ఈ ఏరియర్స్ బకాయిలు ఒకేసారి అందుతున్నాయి. 23 నెలలకు సంబంధించిన పీఎఫ్ షేర్, ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలను కట్ చేసి మిగిలిన డబ్బులను ఒకేసారి ప్రభుత్వం చెల్లించనుంది. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ఏరియర్స్ విడుదల చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.