KNR: తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో నూతన వివో భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.