AKP: ఎస్.రాయవరం మండలం వమ్మవరం వద్ద ఆదివారం సంత్ నిరంకారీ మిషన్ ఆధ్వర్యంలో వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నాచు తొలగించి శుభ్రం చేశారు. మిషన్ కసింకోట సెక్టార్కు చెందిన సంయోజకులు కె చిదంబరావు, నాగరాజు, ప్రచారకులు సత్యవతి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్ధాలు వల్ల నది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.