ATP: రాష్ట్ర వ్యాప్తంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది కానుక అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.