సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కనగానపల్లిలో వెలసిన శ్రీ అతకల్లపట్నం పెదయ్య స్వామి చెంతకు పాలదుత్త రానుంది. మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన బిల్లే వారు కాలినడకన ఈ పాలదుత్తను స్వామివారి మూలస్థానానికి తీసుకువస్తారు. ప్రతిఏటా ఉగాది, తొలిఏకాదశి, విజయదశమి రోజుల్లో ఈ మహిమాన్విత ఘట్టం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.