AP: మాచర్లలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. నెల్లూరు జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో 144 సెక్షన్ విధించారు. జంట హత్య కేసులో పిన్నెల్లి 98 రోజులు నెల్లూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.