»Maharashtra Seven People Were Killed By Lift Workers
Maharashtra : లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం
నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. చనిపోయిన వారంతా దినసరి కూలీలు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం (7 died) చెందారు. రాష్ట్రంలోని థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కూలిపోయింది. కార్మికులు టెర్రస్ పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు జారింది. టెర్రస్‌పై వాటర్ ప్రూఫింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు ముగించుకుని 40 అంతస్తుల నిర్మాణం నుంచి కార్మికులు కిందికి దిగుతున్నారు.
ఆ సమయంలోనే లిఫ్ట్ (Lift)లో కదలిక ఏర్పడింది. కార్మికులు లిఫ్ట్‌లో దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ లోని సపోర్టింగ్ కేబుల్స్ (Supporting Cables)లో ఒకటి పగిలిపోయింది. దానివల్ల ఈ దారుణం జరిగిందని థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధిపతి యాసిన్ తాడ్వి వెల్లడించారు.
నిర్మాణ లిఫ్ట్ వేరుగా ఉంటుందని, అది సాధారణ ఎలివేటర్ కాదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.