TG: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని TPCC చీఫ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమేనని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.