»Who Is The Contestant Who Will Be Eliminated In The First Week Of Bigg Boss 7
Bigg Boss 7 : బిగ్బాస్7లో తొలివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?
బిగ్ బాస్7 తొలివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని, అది కూడా కిరణ్ రాథోడ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్7 (Bigg Boss 7)లో తొలివారం ఎలిమినేషన్ స్టార్ట్ కానుంది. ఇప్పటి వరకూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటి సభ్యులు కాలేదని, అందుకే మొదటివారం ఎలిమినేషన్ ఉండదనే ప్రచారం జరిగింది. అయితే మొదటివారంలో ఎలిమినేషన్ ప్రక్రియను బిగ్బాస్ జరిపించడం విశేషం. తాజాగా ఆ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
తొలివారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లు నిలిచారు. అందులో రతిక రోజ్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, దామిని భట్ల, గౌతమ్ కృష్ణలు నిలిచారు. అందులో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించినట్లు సమాచారం. మిగిలిన వారిలో చూస్తే ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్లు డేంజర్ జోన్లో ఉన్నారు.
ఈ ఇద్దరు కంటెస్టెంట్లు తెలుగు సరిగా మాట్లాడటం రాక హౌస్లో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కిరణ్ రాథోడ్ మొదటి వారంలో అంతగా ఆకట్టుకోలేదు.
హౌస్ లోని కిచెన్లో కిరణ్ రాథోడ్ కొన్ని పనులు మాత్రమే చేసింది. టాస్కులు ఏవీ ఆడలేకపోయింది. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని, బిగ్బాస్ కూడా ఆమెను ఎలిమినేట్ చేశాడని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే. ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఎలిమినేషన్ లేకుండా కొనసాగించే ఛాన్స్ కూడా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.