ELR: ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలోని కోకో తోటలను రాష్ట్ర కోకో రైతుల సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. కోకో గింజలు కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోకో గింజలకు ప్రైస్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రైతుల వద్ద ఉన్న కోకో గింజలు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.