GDWL: ఉగాది పర్వదినం రోజున ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో శ్రీ ఆంజనేయస్వామి, సీతారామచంద్రస్వామి, వేంకటేశ్వరస్వామి, శివాలయాల నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి గుడి, బడి ప్రాణాధారాలు అని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి చేస్తామన్నారు.