KNR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2018 మే 10న రైతుబంధు తొలి చెకును అందుకున్న రైతు మూగల సంజీవరెడ్డి(94) మరణించారు. హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన ఆయన ధర్మరాజుపల్లి ధాన్య విత్తన సంఘం, రైతుసేవా పురుషుల పొదుపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా, అదేవిధంగా గ్రామ తొలి సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.