ప్రకాశం: దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి డా. డోల బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఘనంగా జరిగాయి. మంత్రితో పాటు కలెక్టర్ దంపతులు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ ఇతర ముఖ్యులు హాజరయ్యారు. వేద పండితుడు ఈ సంవత్సర పంచాంగాన్ని వివరించారు.