»G20 Summit What Is Eu Middle East India Rail And Port Deal Why Will It Be Historic
G20 Summit India: ఇక ఢిల్లీ నుండి దుబాయ్-న్యూయార్క్ వరకు రైలులో ప్రయాణించవచ్చు
రైలు రవాణా కారిడార్లు, షిప్పింగ్ కారిడార్ల ద్వారా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య ఆసియా, దక్షిణాసియాలను అనుసంధానించే ప్రణాళికకు త్వరలోనే అంకురార్పణ జరుగనుంది.
G20 Summit India: ఢిల్లీ నుండి న్యూయార్క్, దుబాయ్ లేదా యూరప్‌లోని ఏదైనా నగరానికి వెళ్లాలనుకుంటే విమానంలోనే వెళ్లాలి. కానీ త్వరలోనే మీరు రైల్లో న్యూయర్క్ వరకు వెళ్లవచ్చు. రైలు రవాణా కారిడార్లు, షిప్పింగ్ కారిడార్ల ద్వారా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య ఆసియా, దక్షిణాసియాలను అనుసంధానించే ప్రణాళికకు త్వరలోనే అంకురార్పణ జరుగనుంది. ఈ కారిడార్‌ను సిద్ధం చేసే ఒప్పందంపై అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యుఎఇ, యూరోపియన్ యూనియన్, ఇతర జి 20 దేశాల మధ్య చర్చ జరిగిందని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. ఇది ఢిల్లీలో జరుగుతున్న జి-20 సమ్మిట్ సందర్భంగా ప్రకటించబడింది. ఈ కారిడార్‌ను సిద్ధమైతే భారతదేశం నుండి మధ్య ఆసియా మీదుగా ఐరోపాకు రవాణా సదుపాయాలు పెరిగి వాణిజ్యం మెరుగుపడుతుంది.
శనివారం ఢిల్లీలో జరుగుతున్న జి-20 సదస్సు తొలి సెషన్‌కు ‘వన్ ఎర్త్’ అని పేరు పెట్టారు. ప్రపంచం మొత్తాన్ని ప్రత్యేక దేశాలుగా చూడకుండా ఏకతాటిపై చూసేందుకు, అదే పద్ధతిలో ప్రణాళికలు రూపొందించడం ఈ సెషన్ ఉద్దేశం. రైలు, షిప్పింగ్ కారిడార్లు కూడా ఈ లక్ష్యంలో భాగంగా కనిపిస్తాయి. అన్ని దేశాలు రైలు, షిప్పింగ్ కారిడార్ల ద్వారా తమ మధ్య కనెక్టివిటీని సృష్టించుకోవడంలో ఉత్సాహంగా ఉన్నాయని వైట్ హౌస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ ఫైనర్ తెలిపారు. జీ20 సందర్భంగా ప్రపంచ మౌలిక సదుపాయాలపై శనివారం నాడు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) సంతకం గురించి సమావేశంలో ప్రకటన చేయవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసుకు సంబంధించిన సవాళ్లను సమావేశంలో చర్చించనున్నారు. రైలు, షిప్పింగ్ కారిడార్ కోసం అవగాహన ఒప్పందం తర్వాత గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి సారించే నిమిత్తం శనివారం సమ్మిట్ తర్వాత అధ్యక్షుడు బిడెన్, ప్రధాని మోడీ ఇతర నాయకులను కలుస్తారని ఫైనర్ చెప్పారు. ఈ ఒప్పందం కుదిరితే ఈ ప్రాంతంలోని పేద తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని ఫైనర్ పేర్కొన్నారు. అలాగే, ఇది ప్రపంచ వాణిజ్యంలో మధ్యప్రాచ్య దేశాలకు ముఖ్యమైన పాత్రను ఇస్తుంది. ఇది కేవలం రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదని ఆయన అన్నారు. ఫైనర్ దీనిని నిరుపేదలకు సేవ చేసే ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు.