NLG: చిట్యాల మండలం వెలిమినేడు, బొంగోని చెరువు గ్రామాల్లో ఈ నెల 27న జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను గురువారం సర్పంచులు, గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా పురోహితులు వావిలాల ప్రభాకర్ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు బొంతల చంద్రారెడ్డి, ఆశయ్య, ఛైర్మన్ సాయికృష్ణ రెడ్డి పాల్గొన్నారు.