తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ (Gaming phone) కొనాలని ఆలోచిస్తు వారికి గుడ్ న్యూస్. చైనాకు చెందిన ఐకూ కంపెనీ ఇటీవల విడుదల చేసిన iQoo Neo 7 5G ఫోన్ రేటును తగ్గించింది. ఫిబ్రవరిలో మనదేశంలో రిలీజైన్ ఈ ఫోన్ సెపేరేటు ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండు వేరియంట్ల (Variants)లో లభించే ఈ మొబైల్‌పై రూ.2 వేల వరకు తగ్గింపు లభించనుంది. గతంలో రూ.29,999కు లభించే ఈ మొబైల్ ప్రస్తుతం అమెజాన్ (Amazon) ఈ కామర్స్ సైట్లో రూ.27,999కే అందుబాటులోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమన్సిటీ, 8200 ప్రాసెసర్ కూడా మిడ్ రేంజ్లో హెవీ గేమింగుకు సెట్ అయ్యేలా ఉంది. iQoo Neo 7 5G స్మార్ట్‌ఫోన్ (Smartphone) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 8GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999, అయితే దీని ధర రూ. 2 వేల తగ్గింపుతో ఇప్పుడు రూ. 27,999. అంతేకాకుండా.. 12GB+256GB మోడల్ ధర రూ.33,999. iQoo Neo 7 5G స్మార్ట్‌ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం ఈ పరికరం అమెజాన్‌లో తక్కువ ధర(Low price)కు అందుబాటులో ఉంటుంది. సూపర్ క్వాలిటీ కెమెరా, పవర్ ఫుల్ ప్రాసెసర్ తో గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటోంది. iQoo Neo 7 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పూర్తి HD+ (2400×1080 Pexels) AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ARM Mali G610 GPUతో వస్తుంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్షన్ 8200 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ 12GB వరకు LPDDR5 RAM.. 256GB వరకు UFS3.1 అంతర్గత నిల్వను కూడా కలిగి ఉంది.దీన్ని కేవలం 10 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది 5G, Wi-Fi, బ్లూటూత్, OTG, NFC, GPS, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీ(Connectivity)తో వస్తుంది. భద్రతా ప్రయోజనాల కోసం ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.