తూ.గో: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని అధికారులతో, ఉద్యోగులతో కలిసి జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ కలెక్టరేట్ సిబ్బందిని అభినందించారు.