»Sajjala Ramakrishna Reddy Said There Is Evidence That Chandrababu Is Involved In The Scam
Sajjala ramakrishna reddy: ఈ స్కాంలో చంద్రబాబు ప్రమేయమున్నట్లు ఆధారాలున్నాయ్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టు అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఈ కేసు విషయంలో అసలు విషయం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసు విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.
sajjala ramakrishna reddy said There is evidence that Chandrababu is involved in the scam
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) స్పందించారు. ఇది ఓవర్ నైట్ తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో 09.12.2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఏపీ సీఐడీ సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు అనేక మందిని ప్రశ్నించినట్లు సజ్జల చెప్పారు. ఈ స్కాంలో ప్రధానంగా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు బలమైన ఆధారాలు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిని ఎందుకు చెబుతున్నానంటే అసలు విషయం ప్రజలకు తెలియాలని అనుకుంటున్నట్లు వివరించారు. ఈ అంశం గురించి చంద్రబాబుకు కూడా ముందే తెలుసని అందుకే తనని అరెస్టు చేస్తారని ముందుగానే చెప్పాడని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారని అన్నారు.
ఈ స్కాం(skill development scam) గురించి 2017, 18లోనే సెంట్రల్ ఏజెన్సీలు పలు విషయాలు స్పష్టం చేశాయని సజ్జల తెలిపారు. రూ.240 కోట్లు డైవర్ట్ అయ్యాయని, షెల్ కంపెనీ ద్వారా అక్రమంగా తరలాయని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసు అంశం ప్రస్తుతం కోర్టుకు వెళుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు(Chandrababu)పై ఉన్న ఆరోపణలపై ఆయన స్పష్టం చేస్తే సరిపోతుందని సజ్జల వెల్లడించారు. తదుపరి చర్యలు కోర్టు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ(TDP) తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.