నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ KR సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం బుధవారంతో ముగిసింది. తనను నమ్మి MPగా అవకాశం ఇచ్చిన KCRకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా 1959లో జిల్లాలోని చౌట్పల్లిలో జన్మించిన సురేశ్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.