»The Heat Is Increasing In Ap Politics Perni Nani Made A Comment On The Tdp Chief Chandra Babu Naidu
Perni Nani: 40 ఏళ్లలో తండ్రి పేరు ఒక్క సారికూడా చెప్పలేదు.. చంద్రబాబుపై పేర్ని నాని కౌంటర్
చంద్రబాబు బహిరంగ సభల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బాబుపై ఘాటు విమర్షలు చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నీ నాని కూడా టీడీపీ అధినేతపై గట్టిగనే విరుచుకుపడ్డారు.
The heat is increasing in AP politics Perni Nani made a comment on the TDP chief chandra babu naidu
Perni Nani: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ కూడా తన తండ్రి ఎవరో చెప్పలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో బాబు ఉన్నారన్నారు. కాని జగన్ అలా కాదని వైఎస్ఆర్, విజయమ్మల తనయుడినని సీఎం గర్వంగా చెప్పుకుంటారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన ఓ లక్షసార్లు తన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నారన్నారు. చంద్రబాబు అలా కాదని వారి పేర్లు చెప్పడానికి సిగ్గుపడుతారని తెలిపారు. ముఖ్యమంత్రి గురించి ఇష్టారీతిగా మాట్లాడడం ఆపేయ్యాలన్నారు. ఎవరిది దౌర్భాగ్యమైన బతుకో ప్రజలకు తెలుసన్నారు.
కొత్తగా నేను హిందువును అని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. తల్లిదండ్రులు చనిపోతే తలకొరవి పెట్టనివాడు, జుత్తు తీయనివాడు చంద్రబాబని విమర్చించారు. రామారావు అల్లుడినని చెప్పుకుంటారు తప్ప పలానా వ్యక్తి కొడుకును అని చెప్పుకోలేని వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడి వల్ల రాజకీయాలు భ్రష్టుపట్టాయన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడని పేర్కొన్నారు. జగన్పై అక్కసుతో దిగజారుడు మాటలు వద్దన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ జెండాను దింపలేరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక, ఇప్పుడు ఎన్నో హామీలు ఇస్తున్నారన్నారు. 80 ఏళ్ల ముసలి చంద్రబాబుకు ఒకటే చెబుతున్నానని… జగన్ను ఏమీ చేయలేక ఉక్రోషంతో దౌర్భాగ్యపు మాటలు కట్టిపెట్టాలన్నారు. వయస్సుకు తగ్గట్టుగా మాట్లాడాలని పేర్ని నాని అన్నారు.