TG: రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ను పురస్కరించుకుని రేపు ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జుమాతుల్ విదా రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసుకునే ముస్లిం ఉద్యోగులకు ఈ సెలవు ఎంతగానో ఉపయోగపడనుంది.