TG: సంగారెడ్డి జిల్లా BHELలో వెదురు హస్తకళలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై జరిగిన 6 రోజుల శిక్షణ ముగిసింది. PJTSAU ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18 వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. మహిళలు వెదురుతో ల్యాంప్ షేడ్స్, లాండ్రీ బాస్కెట్లు తయారు చేసి ఆర్థికంగా ఎదగాలని అతిథులు సూచించారు. తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ విజయవంతమైంది.