ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో ఎంటరైన వీరయ్య.. ఐదు రోజుల్లోనే 140 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల మాట. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ను చూపించినందుకు.. డైరెక్టర్ బాబీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో వినిపించినట్టుగా.. బాలయ్యతో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు చిరంజీవి సినిమా కంటే ముందే బన్నీకి.. బాబీ ఓ కమర్షియల్ మాస్ కథ వినిపించాడట. కానీ పుష్ప తర్వాత చూద్దాం.. అన్నట్టుగా చెప్పాడట బన్నీ. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవడంతో.. బాబీకి ఓకె చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల సమచారం. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు బన్నీ. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని టాక్. అలాగే రేసుగుర్రం కాంబో రిపీట్ చేస్తూ.. సురేందర్ రెడ్డితోను ప్లాన్ చేస్తున్నాడట. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. కాబట్టి పుష్ప 2 తర్వాత బాబీతో ఉంటుందా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ బన్నీతో బాబీ ఛాన్స్ అందుకుంటే మాత్రం.. నెక్స్ట్ పాన్ ఇండియా రేంజ్లో కొట్టబోతున్నాడని చెప్పొచ్చు. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.