కాకినాడ: గత వారం రోజులుగా కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలలో తిరిగిన పెద్దపులి బుధవారం రాత్రి పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. రాజవొమ్మంగి మండలంలోకి పులి ప్రవేశించినట్లు ఆధారాలు లభించాలని అటవీ అధికారులు తెలిపారు. బోర్నగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం పులి సంచరించినట్లు నిర్ధారించారు.