Alluarjun: బన్నీ కోసం ట్రై చేస్తున్న మాస్ డైరెక్టర్?
అల్లు అర్జున్ కోసం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ తెగ ట్రై చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. కానీ ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. జవాన్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత.. బన్నీని కథ వినిపించబోతున్నాడట.
పుష్ప పార్ట్ వన్ను మించి సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. వెయ్యి కోట్లు టార్గెట్ చేసిన బన్నీ, సుకుమార్.. పుష్ప2ని ఊహకందని విధంగా డిజైన్ చేస్తున్నారు. వచ్చే సమ్మర్లో పుష్పరాజ్ థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పుష్ప తర్వాత రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు బన్నీ. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ సినిమాల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చేశాడు. ముందుగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు బన్నీ.
ఇక ఈ సినిమాల తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ చాలా రోజులుగా ఊరమాస్ కాంబినేషన్ మాత్రం వినిపిస్తునే ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో బన్నీ ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు గతంలో వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ లైన్లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబోకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. భారీ హైప్‌తో థియేటర్లోకి రాబోతోంది జవాన్. ఈ సినిమా తర్వాత అట్లీ బన్నీతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పపికే అల్లు అర్జున్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసుకున్నాడట అట్లీ. త్వరలోనే బన్నీకి ఆ కథ వినిపించేందుకు రెడీ అవుతున్నాడట. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. కానీ అది ‘జవాన్’ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.