హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2,780 తగ్గి రూ.1,54,640 వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,41,750గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్న ధరలు ఒక్కసారిగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.