GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ముఖ్య సమాచారం. ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50% రాయితీ ప్రకటించింది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే అసలు పన్నుతో పాటు మిగిలిన 50% వడ్డీని ఈ నెల 31లోపు ఒకేసారి చెల్లించాలి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు తెలిపారు.