NDL: ఆళ్లగడ్డలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా ఆధ్వర్యంలో పాత మసీదు, జామియా మర్కస్ మస్జిద్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఐక్యతకు నిదర్శనమే ఇఫ్తార్ విందు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ యుగంధర్, ఇతర అధికారులు, వివిధ మతాల ప్రజలు పాల్గొన్నారు. మతపెద్దలు సోదరభావంతో ఒకరికొకరు పండ్లను ఇచ్చిపుచ్చుకున్నారు.