చిత్తూరు జిల్లా శాంతిపురం(M) ముల్లూరు కృష్ణాపురంలో నవాజ్ (19) హత్య కేసును పోలీసులు చేధించారు. గ్రామానికి చెందిన షాహిన్ తాజ్, ఫరుక్ బాషా కుమార్తెను నవాజ్ ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో యువకుడుని ఇటుక రాయితో కొట్టి హత్య చేసినట్లు రూరల్ CI మల్లేష్ యాదవ్, SI నరేష్ తెలిపారు. హత్య చేసిన ఇద్దరినీ ముల్లారు కృష్ణాపురం క్రాస్ వద్ద నిన్న అరెస్ట్ చేశారు.