TGSRTC గ్రీన్ ట్రాన్స్పోర్ట్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద రాష్ట్రానికి తాజాగా మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. తొలిదశలో భాగంగా ఇప్పటికే 2,000 బస్సులను కేంద్రం మంజూరు చేయగా, ఇప్పుడు అదనంగా ఈ బస్సులు తోడయ్యాయి. వీటి రాకతో HYDలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.