AP: మంత్రి లోకేష్ 10,060 పోస్టులతో బాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగను ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, అన్ని పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషంగా ఉందని.. ప్రతి ఏటా ఇలాగే ఉద్యోగ ప్రకటనలు ఉంటాయన్నారు.