ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘X’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లు టైమ్ లైన్ను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్ అయినట్లు తెలుస్తోంది. రాత్రి 8 నుంచి అంతరాయం ఏర్పడింది. మొబైల్, డెస్క్టాప్ వర్షన్లలో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.