ELR: సర్వ మానవాళి సుఖసంతోషాల కోసం ప్రార్థించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. స్థానిక గిరిజన భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఓర్పు, సహనం, సత్ప్రవర్తనను అలవరుస్తాయని కలెక్టర్ తెలిపారు. మేయర్ నూర్జహాన్, ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు.