సత్యసాయి: ఉగాది పర్వదినం సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆంధ్రప్రదేశ్ యువత భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. భగవాన్ సత్యసాయి బాబా పాదపద్మాలకు కృతజ్ఞతగా తొమ్మిది భక్తి గీతాలను ఆలపించి భక్తులను అలరించారు. వర్షం కురిసి వాతావరణం చల్లబడటంతో ఈ వేడుక మరింత శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, భక్తులు పాల్గొన్నారు.