తూ.గో: YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని అనపర్తి మాజీ MLA సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం తాడేపల్లి కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు. క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు, డిజిటలైజేషన్, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మాజీ MLA సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.