NLR: ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ ఇల్లు, కుళాయి పన్ను చెల్లించేలా నెల్లూరు కార్పొరేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిషనర్ నందన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్పొరేషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సకాలంలో పన్నులు కట్టి నగర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.