»Driver Too Clever To Avoid Traffic In Delhi Arrested And Auto Seized
Viral Video: డ్రైవర్ అతి తెలివి..ఆటో సీజ్
ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఓ ఆటో డ్రైవర్ రూల్స్‌ను అతిక్రమించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Driver too clever to avoid traffic in Delhi.. Arrested and auto seized
Viral News: మాములుగానే ఆటో డ్రైవర్లు అంటే రఫ్‌గా ఉంటారని పేరు. దానికి తగ్గట్లుగానే ఒక వ్యక్తి ప్రవర్తన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం తాను ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి ఇలా చేశాడని తెలుస్తుంది. దేశంలో ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో(metropolitan cities) ఉండే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి చాలా మంది షాట్ కట్స్ వెతుకుతారు. ఇక నగరాల్లో అయితే ద్విచక్ర వాహనదారులే కాకుండా ఆటో వాహనాలు కూడా కొంచెం గ్యాప్ ఉన్నా దూసుకెళ్లడం పరిపాటి. ఇది కొన్నిసార్లు సమస్యను చక్కబెట్టగా.. మరికొన్ని సార్లు ఇరకాటంలో పడేలా చేస్తుంది. అయితే ఓ ఆటో డ్రైవర్ చేసిన ఘనకార్యం ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు తన వాహనాన్ని ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) ఎక్కించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను 25 ఏళ్ల మున్నాగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేశారు. అయితే దీనిపై నేటి జనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ బాధ పడలేక అలా చేసుంటాడని కొందరు అంటుంటే, అలా చేయడం చట్టరిత్యా నేరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కాస్త సంయమనం పాటిస్తే చాలు ఇలా చేస్తే లేదంటే.. అందరికీ ప్రమాదకరమే అని నెటిజన్లు భావిస్తున్నారు.
ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తప్పించుకునేందుకు ఏకంగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటోను నడిపేశాడు ఒక యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్‌ను మున్నాగా గుర్తించి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.#Delhi#Auto#UANowpic.twitter.com/FKlnQg5QeA