AP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు ఉగాది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. సీఎం సమక్షంలో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సందర్బంగా కళారత్న, ఉగాది పురస్కారాల అవార్డులను ఆయన ప్రదానం చేయనున్నారు.