NRML: చిత్తడి నేలలు (వెట్‌ల్యాండ్స్) పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని బుధవారం సమావేశంలో అధికారులకు సూచించారు.